Friday, September 12, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్కోహ్లీని అరెస్ట్ చేయాలి

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌

బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్‌ కొహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌(#ArrestKohli)ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. తెలంగాణలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని, అలాగే కర్ణాటకలోనూ ఆ పార్టీ సర్కారే ఉన్నందున కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. పుష్ప-2 సినిమా విడుదల రోజు హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్‌ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందారు. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి కారణం హీరో అల్లు అర్జునే అని ఏకంగా సీఎం రేవంత్‌ రెడ్డే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రీతిలో బెంగళూరు తొక్కిసలాటకు కోహ్లీని బాధ్యుణ్ని చేస్తారా అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News