Wednesday, February 11, 2026
HomeరాజకీయంKishan Reddy | గురువు నుంచి శిష్యుడి దాకా..

Kishan Reddy | గురువు నుంచి శిష్యుడి దాకా..

  • పాక్ లో పేలని బాంబులు జుబిల్లేహిల్స్ లో పేలతాయన్న సీఎం రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ ముందునుంచీ ఇదే ధోరణి
  • నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటు
  • మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

పాకిస్థాన్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రేమ, అభిమానం అజరామరమని.. గురువు నుంచి శిష్యుడి దాకా అదే వ్యామోహం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ను చులకన చేస్తూ భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. పాకిస్థాన్కు మద్దతుగా మాట్లాడుతూ భారత ఆర్మీని అగౌరవ పరుస్తున్నామనే సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ వైపుకు స్టాండ్ తీసుకొని శత్రుదేశం భాషలో మాట్లాడుతూ శత్రువుల మాటలను సిగ్గు లేకుండా వల్లెవేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రికి తెలియని విషయం ఏంటంటే.. పాకిస్థాన్ భూభాగంలో దాక్కున్న ఉగ్రవాదులను, వారి స్థావరాలను భారత గైడెడ్ క్షిపణులు విజయవంతంగా మట్టుబెట్టాయని.. 11 ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేశాయన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ముందు ఈ విషయాలను తెలుసుకుని మాట్లాడాలని కిషన్ రెడ్డి హితవుపలికారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News