Friday, October 3, 2025
ePaper
Homeస్పోర్ట్స్Kidambi Srikanth | కిదాంబి శ్రీకాంత్ న్యూ జ‌ర్నీ..

Kidambi Srikanth | కిదాంబి శ్రీకాంత్ న్యూ జ‌ర్నీ..

హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్‌లో నంది ఛార్జర్స్ జట్టులో ఇన్వెస్ట్‌

భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, మాజీ పురుషుల సింగిల్స్ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), అధికారికంగా హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్(HPL)లో పెట్టుబడిదారుడిగా, భాగస్వామిగా నంది ఛార్జర్స్ ఫ్రాంచైజీలో చేరారు. ఆయన రాక ఈ లీగ్‌కు అత్యున్నత స్థాయి క్రీడా ప్రమాణాలను తీసుకువస్తుంది. ఈ అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న పికిల్‌బాల్ క్రీడకు ఇది మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది. 12కి పైగా అంతర్జాతీయ టైటిల్స్ సాధించిన శ్రీకాంత్, ప్రపంచ బ్యాడ్మింటన్‌లో దేశ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు, ఆయన నంది ఛార్జర్స్ జట్టుతో కలసి ఛాంపియన్ల ఆలోచనను, పోటీ స్ఫూర్తిని పికిల్‌బాల్‌లోకి తీసుకురానున్నారు.

“హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్‌లో భాగం కావడం, నంది ఛార్జర్స్‌తో చేతులు కలపడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. పికిల్‌బాల్ చాలా వేగంగా, డైనమిక్‌గా ఉంటుంది. భారతదేశంలోని అభిమానులతో కనెక్ట్ అవడానికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది, చూడటానికి థ్రిల్లింగ్‌గా, అత్యంత పోటీతత్వంతో ఉంటుంది. నా క్రీడా అనుభవాన్ని ఒక కొత్త రంగంలోకి తీసుకువచ్చి, ఈ లీగ్ ప్రాముఖ్యతను పెంచడానికి సహాయపడటం నన్ను ఎంతో ఉత్తేజపరిచే విషయం. ఈ ప్రయాణం ప్రారంభంలోనే భాగం కావడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. నంది ఛార్జర్స్ జట్టు ఉత్సాహంగా ఆడుతూ అందరికీ స్ఫూర్తినిస్తుందని నేను నమ్ముతున్నా” అని కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నంది ఛార్జర్స్ ఫ్రాంచైజీ యజమాని అనిరుధ్ పొన్నాల మాట్లాడుతూ, “శ్రీకాంత్‌ను నంది ఛార్జర్స్ కుటుంబంలోకి స్వాగతించడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశపు గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరిగా ఆయన స్థాయి మా జట్టుకు అపారమైన విశ్వసనీయతను, శక్తిని తీసుకువస్తుంది. అద్భుతమైన నైపుణ్యం, పోటీతత్వం, గెలుపు స్ఫూర్తిని చూపిస్తూ మా జట్టును ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ప్రధాన లక్ష్యం.” అని వివరించారు. హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు ఉంటాయి. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం రాత్రి మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీకాంత్, అనిరుధ్ పొన్నాల కలిసి నంది ఛార్జర్స్ జట్టును ఈ సీజన్‌లో ఆకర్షణీయమైన జట్లలో ఒకటిగా నిలపబోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News