Sunday, April 5, 2026
Homeఆదిలాబాద్Khanapur | మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి.

Khanapur | మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి.

  • చైర్మన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ ఎన్నిక.

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ లు ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తమ చేతులు ఎత్తి మద్దతు తెలియజేశారు. ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు.

ఎన్నిక అనంతరం చైర్మన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయా హుస్సేన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మెన్ ఎన్నిక సందర్భంగా బందోబస్తు ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి లు పర్యవేక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అదన కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ప్రత్యేక అధికారి (సిపిఓ) జీవరత్నం, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News