నిర్మల్(Nirmal) జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC) అధ్యక్షుడి(President)గా ఖానాపూర్ ఎమ్మెల్యే(Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) నియామక పత్రాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్(GandhiBhavan)లో జరిగిన కార్యక్రమంలో అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో బొజ్జు పటేల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ చేతుల మీదుగా నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా బొజ్జు పటేల్ తెలిపారు.
Vedma Bojju Patel | నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా నియామకపత్రం
By Aadab Desk
- Advertisement -
Previous article
