మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు
రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో మంగళవారం నిర్వహించిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమం(Road Safety Awareness Programme)లో స్థానిక ఎమ్మెల్యే(Khanapur Mla), నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు(Nirmal DCC Chief) వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను(Road Accidents) నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అరైవ్–అలైవ్(Arrive-Alive) ప్రోగ్రామ్ చేపట్టినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్(Helmet) ధరించాలని సూచించారు. నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్(Seatbelt) వాడాలని, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని కోరారు.
మైనర్లకు అవగాహనలేక అతివేగంతో వెళ్లటం ప్రమాదాలకు దారితీస్తోందని, మద్యం సేవించి వాహనం నడపడం కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఆటోలు, పెద్ద వాహనాల యూనియన్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని ఖానాపూర్ పట్టణ సీఐ, ఎస్ఐలను ఆదేశించారు. ఆటో డ్రైవర్ల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ ఫీజులు తగ్గించేందుకు RTO అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ్, ఎస్ఐ రాహుల్ గైక్వాడ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
