Tuesday, October 28, 2025
ePaper
Homeహైదరాబాద్‌Kerala Police | మిస్సింగ్ కేసును చేధించిన కేరళ పోలీస్

Kerala Police | మిస్సింగ్ కేసును చేధించిన కేరళ పోలీస్

సహకరించిన బాలా నగర్ ఇన్‌స్పెక్టర్ టి.నరసింహ రాజు

కేరళలోని నూరనాడ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక మహిళ మిస్సింగ్ కేసు(Missing Case)కి మన హైదరాబాద్ బాలానగర్(Bala Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో తెరపడింది. తన భార్య కనబడడం లేదని ఒక రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు (Kerala Police) దర్యాప్తు ప్రారంభించారు. వాళ్లు సేకరించిన వివరాల ప్రకారం, ఆ మహిళ ఆచూకీ హైదరాబాద్ లోని బాల్ నగర్ లో ఉన్నట్టు తెలిసింది. తదనుగుణంగా నలుగురు కేరళ పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ వచ్చి బాలానగర్ ఇన్‌స్పెక్టర్ నరసింహారాజు కి విషయం తెలియజెప్పి ఈ కేసును పరిష్కరించడంలో తన వంతు సహకారం అందించాలని కోరారు.

రెండు రాష్ట్రాల పోలీసు శాఖలు పరస్పర సహకారంతో నిమిషాల వ్యవధిలోని ఈ కేసును పరిష్కరించడం విశేషం. గుర్తించిన మహిళను ప్రోటోకాల్ (Protocol) ప్రకారం కేరళ తీసుకువెళ్లారు. కీలకమైన సమయంలో, ఆఖరి నిమిషంలో సహాయం అడిగినప్పటికీ, ఈ కేసుని బాధ్యతగా తీసుకొని కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ బాలానగర్ పోలీసు శాఖకు కేరళ పోలీసులు కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే కేసుకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషకరమైన విషయమని బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ రాజు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇందులో గ్రౌండ్ లెవెల్ లో కీలక పాత్ర పోషించిన ప్రతి పోలీసు సిబ్బందిని అతను కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News