Wednesday, March 4, 2026
HomeతెలంగాణKCR | జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేసీఆర్ సమావేశం

KCR | జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేసీఆర్ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubileehills Byelection)పై బీఆర్ఎస్ (BRS) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఎర్రవెల్లి (Erravalli) నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎలక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ (Congress Party Government) వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ కార్డులు (Baaki Cards) ప్రతి ఇంటికీ పంచాలని ఆదేశించారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా మూలన పడేసిందో వివరించాలని అన్నారు. ఈ అనివార్య ఎన్నికలో మాగంటి సునీతను గెలిపించడానికి అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరుచుకుపడుతున్నారని, మాగంటి సునీత (Maganti Suneetha) గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News