Friday, March 27, 2026
HomeజాతీయంKBC | కౌన్ బనేగా కరోడ్ పతి లో రూ. 50 లక్షలు విన్..

KBC | కౌన్ బనేగా కరోడ్ పతి లో రూ. 50 లక్షలు విన్..

  • వరద సహాయ నిధుల స్కాంలో కేడీ నెంబర్ వన్..
  • ఓ మహిళా తహశిల్దార్ నేర చరిత్ర..

ఒక మహిళా అధికారిణి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ కార్యక్రమంలో రూ. 50 లక్షలు గెలుచుకున్నది. దీని వల్ల జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు పొందింది. అయితే ఆ మహిళా తహసీల్దార్‌ రూ.2.5 కోట్ల వరద సహాయ నిధుల స్కామ్‌లో అరెస్ట్‌ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 2021లో షియోపూర్ జిల్లాలోని బరోడా తహసీల్దార్‌గా అమితా సింగ్ తోమర్‌ పని చేశారు. ఈ సమయంలో కొంత మంది రెవెన్యూ అధికారులతో కలిసి భారీ స్కామ్‌కు ఆమెకు పాల్పడింది.

సుమారు రూ.2.5 కోట్ల వరద సహాయ నిధులను నకిలీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి కొల్లగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఉన్నతాధికారుల ఫిర్యాదుతో బరోడా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీవోపీ) అవనీత్ శర్మ నేతృత్వంలోని బృందం ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసింది. ప్రస్తుతం విజయపూర్ తహసీల్దార్‌గా ఉన్న అమితా సింగ్ తోమర్‌, 22 మంది రెవెన్యూ అధికారులతో సహా మొత్తం 110 మందిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

మరోవైపు కేసు నమోదు నేపథ్యంలో అమితా సింగ్ తోమర్ గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమె పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. బుధవారం ఆమెపై కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. తహసీల్దార్‌ పదవి నుంచి తొలగించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News