Tuesday, February 10, 2026
HomeరాజకీయంKavitha | సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ

Kavitha | సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థుల పోటీ

మునిసిపల్ ఎన్నికల్లో(Municipal Elections) తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ(All India Forward Bloc Party) సింహం గుర్తు(Lion symbol)పై పోటీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సమక్షంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు కె.బుచ్చిరెడ్డి బుధవారం ప్రకటించారు. అంతకుముందు.. తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతల పలు అంశాలపై చర్చలు జరిపారు. మునిసిపల్ ఎన్నికలతోపాటు భవిష్యత్‌లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆఫీసులో కల్వకుంట్ల కవితతో జావెద్ లతీఫ్, కన్వీనర్ జోజిరెడ్డి, బుచ్చిరెడ్డి, సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్.వి.ఆర్.ప్రసాద్, కొండ దయానంద్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కె.నరేందర్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్గొండ ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి సహా ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News