Wednesday, April 1, 2026
Homeభక్తిKarungali Mala | కరుంగళి మాల ధరిస్తే ఏమి జరుగుతుంది..?

Karungali Mala | కరుంగళి మాల ధరిస్తే ఏమి జరుగుతుంది..?

  • అసలు మంచిదా..? కాదా..? తెలుసుకోండి..

కరుంగళి మాల.. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఈ మాల గురించే చర్చించుకుంటున్నారు. చాలా మంది ఈ మాలను ధరిస్తున్నారు. దీనికి కారణం.. టీవీలు, సోషల్ మీడియాలోనూ కరుంగళి మాల గురించి జరుగుతున్న విసృత ప్రచారమే. కరుంగళి మాల ధరిస్తే ఎన్నో ఉపయోగాలున్నాయని పలువురు జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు. దీనికి సార్వత్రిక ఆకర్షణ అనేది ఉంటుందట. దీనిని ధరిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. వయసుతో పని లేకుండా ఎవరైనా దీనిని ధరించవచ్చని చెబుతున్నారు. ఈ మాల ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

శ్రేయస్సు, సంపద కోరుకునే వారు కరుంగళి మాలను ధరిస్తే ఉపయోగం ఉంటుందట. ఇది సంపదతో పాటు అదృష్టాన్ని అవకాశాలను ఆహ్వానిస్తుందట. దీనిని ధరించడం వలన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించి జీవితంలో ఆటంకాలను తగ్గిస్తుందట. అలాగే ఇది ఆధ్యాత్మికంగానూ ఎంతో శక్తివంతమైనదని చెబుతారు. ప్రశాంతత, స్థిరత్వం, ఏకాగ్రతను పెంపొందించే శక్తి కరుంగళి మాలకు ఉంటుందట. ఇది ధ్యానం, ప్రార్థన, ఆత్మపరిశీలనలో మద్దతుగా పనిచేయడమే కాకుండా..

- Advertisement -

ఆధ్యాత్మిక అవగాహనను బలపరుస్తుంది. భావోద్వేగ, మానసిక శ్రేయస్సు కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందట. ఒత్తిడిని తగ్గించే, శాంతి కలిగించే లక్షణంతో పాటు మనసుకు సౌకర్యం, స్థిరత్వం, భావోద్వేగ సమతుల్యతను కరుంగళి మాల అందిస్తుందట. అలాగే శారీరక ఇబ్బందులను సైతం కరుంగళి మాల తొలగిస్తుందట.

- Advertisement -
RELATED ARTICLES

Latest News