Wednesday, February 11, 2026
Homeకరీంనగర్CM Revanth | సీఎం రేవంత్‌ని కలిసిన కర్ర రాజశేఖర్

CM Revanth | సీఎం రేవంత్‌ని కలిసిన కర్ర రాజశేఖర్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌కు సీఎం శుభాకాంక్షలు

కరీంనగర్, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): ఇటీవల కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌(Chairman of Karimnagar Urban Bank)గా ఎన్నికైన కర్ర రాజశేఖర్ (Karra Rajashekar) శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌(JubileeHills)లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. కర్ర రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కర్ర రాజశేఖర్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి కార్యాచరణతోపాటు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. బ్యాంక్ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కర్ర రాజశేఖర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News