కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి లోనీ కోదండ రామాలయంలో శ్రీ రామ నవమి సీతారాముల వివాహ మహోత్సవానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం హాజరైనారు కోదండ రామాలయాన్ని సందర్శించి రామాలయంలో జరుగుతున్న సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వివాహ కార్యక్రమాన్ని తిలకించారు ఆలయ పూజారులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఆలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన భోజనమును భక్తులతో కలిసి ఆరగించారు సిపి వెంట కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి రూరల్ ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు . కళ్యాణ మహోత్సవానికి పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు
- Advertisement -
