Tuesday, February 24, 2026
Homeకరీంనగర్Arrest | నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ… తల్వార్ తో హంగామా..

Arrest | నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ… తల్వార్ తో హంగామా..

  • యువకులపై దాడి 9 మంది అరెస్టు

అర్ధరాత్రి నడి రోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్ తో కేకును కట్ చేసి హంగామా చేసిన రౌడీ బ్యాచ్ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతి భద్రతాలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరించిన బర్త్ డే పార్టీ బ్యాచ్ వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేసి డబ్బులు లాక్కుని మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నారని ఫిర్యాదు అందడంతో నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగింది.

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ లో జనవరి 31 అర్థరాత్రి 12 గంటల సమయంలో నడి రోడ్డుపై ఓ మైనర్ కు సంబంధించిన బర్త్ డే పార్టీ జరుపుకుంటున్నారు. కారుపైకి ఎక్కి కేక్ ను తల్వార్ తో కట్ చేయడంతో పాటు బాణాసంచా కాలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే సమయంలో రేకుర్తిలోని సమ్మక్క సారలక్క జాతరలో వేసిన టెంట్లను ఓ వాహనంలో డి యుగంధర్, చరణ్ లు అక్కడే ఉన్న టెంట్ హౌజ్ కు తీసుకుని వచ్చారు. .

- Advertisement -

వాహనంలోని టెంట్లను దింపుతుండగా బర్త్ డే జరుపుకుంటున్న వారు చూడడం జరిగింది. బర్త్ డ్ బ్యాచ్ టెంట్ హౌజ్ వద్ద ఉన్న వీరిని గమనించి బూతులు తిడుతూ చరణ్ పై దాడికి పూనుకున్నారు. బూతులు తిడుతూ పిడిగిద్దులు గుద్దుతూ విచక్షణ మరిచిన వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన యుగంధర్ పై కర్రలు, బండలతో దాడి చేశారు. అంతేకాకుండా ఎన్ని తమ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని లేనట్టయితే చంపుతామని బెదిరించడంతో చరణ్ వద్ద ఉన్న రూ. 2 వేలు, మొబైల్ ఫోన్ వారికి అప్పగించినాడు.

యుగంధర్ కూడా తన వద్ద ఉన్న మొబైల్ ఫోనును ఇవ్వడా దానిని నేలకేసి కొట్టారు. ఇదే సమయంలో అటుగా వెలుతున్న స్థానికులు బర్త్ డే బ్యాచ్ ను చెదరగొట్టి బాధితులను ఆసుపత్రికి పంపించినారు. తమ వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్ల విలువ రూ. 40 వేల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న తరువా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.. వీరిలో ముగ్గురు మేజర్లు వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్ లను అరెస్ట్ చేశామని, నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారని సీఐ వివరించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News