Homeనల్లగొండMunicipal Elections | 12వ వార్డ్ లో బీఆర్ఎస్ జోరు ప్రచారం

Municipal Elections | 12వ వార్డ్ లో బీఆర్ఎస్ జోరు ప్రచారం

  • 12వ వార్డు లో గెలుపు పక్కా అంటున్న అభ్యర్థి
  • మోర్తాల సునీతా రమణా రెడ్డి

ఆలేరు పట్టణ కేంద్రంలోని పన్నెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా రమణా రెడ్డి కి మున్సిప‌ల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి విశేషా ఆదరణ లభిస్తుంది ప్రచారం లో భాగంగా మంగళవారం రోజున ఆమె 12 వ వార్డు లో ప్రచారం నిర్వహించారు ప్రచారం లో వినూత్నంగా లాండ్రి షాప్ లో బట్టలు ఐరన్ చేస్తున్న రజక సోదరులను కలిసి ఓటు ను అభ్యర్తించి ఐరన్ చేస్తున్న రజక సోదరులు పడుతున్న కష్ట నష్టనాలను బాధలను అడిగి తెలుకున్నారు

BRS Campaign Gains Momentum in Ward 12 Alair2

కెసిఆర్ హయాంలో రజకులకు ఉచిత కరెంటు తో పాటుగా ఇస్త్రీ పెట్టే లను పంపిణీ చేసిన విషయాన్నీ గుర్తు చేసారు.అనంతరం విలేకరుల తో ఆమె మాట్లాడుతూ..గతం లో కౌన్సిలర్ గా పనిచేసిన కాలంలో వార్డులో 1.20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేసామన్నారు.

- Advertisement -

12 వ వార్డ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ప్ర‌భుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హయాంలో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు యేండ్ల అయినా ఆలేరు పట్టణానికి నిధులు ఇవ్వటం లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ చూపలేదని అన్నారు.

BRS Campaign Gains Momentum in Ward 12 Alair0

ఆలేరు మున్సిపల్ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు రెడ్డి గూడెం, బీసీ కాలనీ, క్రాంతి నగర్ సిల్క్ నగర్ మార్కండేయ నగర్ తో పాటుగా ఆలేరు పట్టణంలోని ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పుట్ట మల్లేశం, బింగి నరసింహులు,పున్నా రెడ్డి, తో పాటుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News