Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిKapra Tahsildar | ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠిన చర్యలు

Kapra Tahsildar | ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠిన చర్యలు

  • ఇకపై అక్రమ. నిర్మాణాలు చేపడితే. క్రిమినల్ కేసులు తప్పవు

ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, భూ కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్ హెచ్చరించారు. శనివారం జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీ, అంబేద్కర్ నగర్, గబ్బిలాల పేట ప్రాంతాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది.

కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రమేష్, సత్యనారాయణలు జెసిబి సహాయంతో ప్రభుత్వ భూములపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలు జరిగితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News