Monday, October 27, 2025
ePaper
Homeనల్లగొండFarmer | కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి విక్రయించండి.

Farmer | కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి విక్రయించండి.

  • గ్రామాలలో తక్కెటతూకం దళారులను నమ్మకండి.
  • సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, “కపాస్ కిసాన్ యాప్”ను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామంలోని సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన “కపాస్ కిసాన్ యాప్” ద్వారా పత్తిని విక్రయించే తేదీ, సమయం, మిల్లుల వివరాలు స్పష్టంగా తెలిసేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాప్ ఉపయోగిస్తే రైతులకు రాత్రింబగళ్లు మిల్లుల వద్ద ఎదురుచూడాల్సిన అవసరం ఉండదన్నారు.పత్తి తేమశాతం 8 నుండి 12 శాతం మధ్యలో ఉంచి నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తెస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని సూచించారు.

గ్రామాల్లో ఏఇఓల సమన్వయంతో క్లస్టర్ పాయింట్లు ఏర్పాటు చేసి, రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో “కపాస్ కిసాన్ యాప్” కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా పత్తి విక్రయం సులభతరం అవుతుందని తెలిపారు. రైతులు పత్తిని తీసుకువచ్చినప్పుడు వే బ్రిడ్జ్‌, మిల్లు వద్ద, ఎగుమతి, లేదా దిగుమతుల వద్ద ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు అడిగితే (వెంకట్ రెడ్డి 7330733970) ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్రామాల్లో తక్కెట తూకాలతో రైతులను మోసం చేసే దళారులపై వ్యవసాయ శాఖ అధికారులు, తూనికలు కొలతలు సమన్వయంతో కలిసి నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐకెపి లేదా సిసిఐ కేంద్రాలా వద్ద ఎవరైనా అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఎవరిపైనా అయిన సరే చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎంఓ నాగేశ్వరశర్మ, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మహమ్మద్ ఫసిద్దిన్, అసిస్టెంట్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, యూఢీసీ కాసిం, గ్రామంలోని మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News