జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటన
కమ్మ సంఘాల నాయకులు (Leaders of Kamma Sanghas) మంగళవారం సీఎం రేవంత్(CM Revanth)ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చేందుకు సమావేశమయ్యారు. అమీర్‌పేట్ మైత్రీవనం(Maitrivanam)లో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR statue) ఏర్పాటుచేయాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో తమ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతోపాటు కమ్మ సంఘాల నాయకుల విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి ఇన్‌ఛార్జ్ బండి రమేశ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
