Homeరంగారెడ్డిWelfare | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

Welfare | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

  • కార్యక్రమంలో పాల్గొన్న కాప్రా మండల తహసిల్దార్ బైరెడ్డి రాజేష్..

మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర మండలంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ శాసన సభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాప్రా తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ సమన్వయం చేశారు.

Kalyana Lakshmi Shaadi Mubarak Cheque Distribution

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక భారం తగ్గించడంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, నాయకులు రాజు యాదవ్, సాయి కృష్ణ, మధు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News