Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKavitha | చింతమడకలో బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత

Kavitha | చింతమడకలో బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత

  • సిద్దిపేట, చింతమడక తమ జాగీరుగా భావించే వాళ్లకు బుద్దిచెప్తామన్న కవిత
  • తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని హెచ్చరిక
  • చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని ఆవేదన
  • భవిష్యత్ లో సొంతూరే కర్మ భూమి కావచ్చని వ్యాఖ్య

స్వగ్రామం చింతమడకలో గ్రామస్థులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. అంతకు ముందు ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. చింతమడక శివాలయంలో కవిత ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. మాదిగ సంఘం చింతకమడక గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పేర్చారు. రామాలయంలో ప్రత్యేక పూజలు.. హైస్కూల్ గ్రౌండ్‌లో గ్రామస్తులతో కలిసి కల్వకుంట్ల కవిత ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని హెచ్చరిక చేశారు. చంద్రుడి లాంటి కేసీఆర్‌కు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట, చింతమడక తమ జాగీరుగా భావించే వాళ్లకు బుద్దిచెప్తామన్నారు. ఎంత ఎక్కువ ఆంక్షలు పెడితే అన్ని ఎక్కువ సార్లు వస్తాను అన్నారు. చింతమడక గ్రామమంటే చరిత్ర సృష్టించిన గ్రామం, చింతమడక ముద్దుబిడ్డ కేసీఆర్ ఎవ్వరు మాట్లాడకముందే తెలంగాణ కోసం కంకణబద్దులయ్యారు. మొత్తం రాష్ట్రమంతా తిరిగి అందరినీ మేల్కొలిపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ఆయన ముందడుగు వేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.

చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. అదే దేశ, రాష్ట్ర చరిత్రను మార్చింది. అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు తనను ఆహ్వానించటం సంతోషంగా ఉందన్నారు. చింతమడక తలెత్తుకొనే విధంగా కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. ఆయనను ఇక్కడ చంద్రుడు అని పిలుస్తారు. అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పని కొంతమంది చేశారు. మచ్చ తెచ్చారని చెప్పగానే తల్లిని, పిల్లను కాకుండా పాపిన్రు. కుటుంబానికి దూరం చేశారని బాధలో ఉన్న సమయంలో మీరు నాకు అండగా నిలిచారు. పెళ్లి అయి కుటుంబాన్ని వదిలేస్తేనే ఎంతో బాధ ఉంటది. అలాంటిది తల్లి, తండ్రి బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబానికి దూరం చేసే కుట్ర చేసిన వాళ్లను వదలిపెట్టనన్నారు. ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందో చూపిస్తాను అన్నారు. ఆ ప్రయాణంలో మీరు నాకు అండగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఏ ఊరు కూడా ఎవరీ అయ్య జాగీరు కాదు. కానీ కొంతమంది జాగీరుగా భావిస్తున్నారు. ఈ ఏడాది నన్ను అక్కున చేర్చుకున్నందుకు నాకు అనేక జ్ఞాపకాలు ఉంటాయి. తన జన్మ భూమియే కర్మభూమి అయ్యే అవకాశం ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News