వృక్షో రక్షతి రక్షితః. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ తెలంగాణ (Telangana) గ్రామీణ వాతావరణం (Rural Environment) నేపథ్యంలో తెరకెక్కిన అరుదైన సినిమా ‘కలివి వనం’(Kalivi Vanam). ఇందులో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్రనాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు నటించారు. హీరోయిన్‌గా నాగదుర్గ పరిచయమవుతోంది. ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించారు. ట్రైలర్‌ను, డేట్ రిలీజ్ పోస్టర్(Date Release Poster)ను సీనియర్ జర్నలిస్టులు రవిచంద్ర, ఫణి, కేశవ చారి, సినీ జోష్ రాంబాబు, శివ మల్లాల, రాధాకృష్ణ విడుదల చేశారు.
సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. అడవి(Forest)లోని చెట్లు (Trees) మనకు ఎంత ఉపయోగపడతాయన్న దాని మీద ఈ సినిమా చాలా బాగా తీశారని చెప్పారు. అంచనాలు లేకుండా సినిమాకు వచ్చిన ప్రేక్షకులందరికీ 100% నచ్చుతుందని మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె. తెలిపారు. దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ.. ఈ రోజుల్లో చిన్న సినిమాకి మీడియా (Media) మిత్రులే బలం, బలగమని చెప్పారు. సినిమా అంటే వినోదమే (Fun) కాదు.. విజ్ఞానం (Science) కూడా అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన సినిమా ఈ కలివి వనం అని పేర్కొన్నారు.
వర్షం ఎలా వస్తుందని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడని చెప్పకూడదని, మొక్క నాటితే చినుకు రాలుతుందనే విషయాన్ని చెప్పాలని సూచించారు. దేవుడితోపాటు ప్రకృతిని కూడా పూజించాలి, ఆరాధించాలి, ప్రేమించాలనే సందేశంతో సినిమా తీసినట్లు వివరించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీని ఆదరించాలని కోరారు.
