Wednesday, February 11, 2026
Homeనల్లగొండStatue | అనంతారంలో బయల్పడిన కాకతీయ యుగ శివలింగం.

Statue | అనంతారంలో బయల్పడిన కాకతీయ యుగ శివలింగం.

  • ఆంజనేయస్వామి విగ్రహం.
  • కార్తీక మాసంలో భక్తులు ఘనంగా నిర్వహించిన తొలి అభిషేకం.
  • పురావస్తు సంరక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి సమీపంలోని అనంతారం గ్రామంలో 11వ శతాబ్దపు కాకతీయ కాలానికి చెందిన సోమసూత్ర శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పరిసరాల్లో తవ్వకాలు జరుగుతున్న సమయంలో పురాతన రాతి శిల్పాలు, శిలాశాసనాలు బయటపడటంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు, గ్రామ ప్రజలు కార్తీక మాసం సందర్భంగా శివలింగానికి తొలి అభిషేకం, పూజా కార్యక్రమం నిర్వహించారు.

అనంతారం, సమీప గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొని “హర హర మహాదేవ” నినాదాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇది సుమారు 800–900 సంవత్సరాల నాటి కాకతీయ కాలం నాటి శివాలయం అవుతుందని, రాతిపై చెక్కిన సోమసూత్రాలు, శిలాశాసనాలు ఆ కాలపు నిర్మాణ శైలిని సూచిస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోనే పాత అనంతారం గ్రామం ఉండేదని పెద్దలు చెబుతారని చెప్తున్నారు. మన గ్రామంలో ఇంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉండడం మా అదృష్టం అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

అయితే ఈ విలువైన పురావస్తు సంపదను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా వీటిని దొంగిలించే ప్రమాదం లేకుండా దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ అధికారులు తక్షణమే సంరక్షణ చర్యలు ప్రారంభించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఇంకా ఈ ప్రాంతంలో మరెన్నో పురాతన శిల్పాలు, శాసనాలు, దేవాలయ అవశేషాలు దాగి ఉండవచ్చని గ్రామ ప్రజలు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News