Wednesday, February 11, 2026
Homeవరంగల్‌MP Kavya | మహిళలు తలచుకుంటే కాదేదీ అసాధ్యం

MP Kavya | మహిళలు తలచుకుంటే కాదేదీ అసాధ్యం

మహిళలు (Women) తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని వరంగల్ ఎంపీ (Warangal MP) డాక్టర్ కడియం కావ్య (Doctor Kadiyam Kavya) అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ (StationGhanpur) పట్టణ కేంద్రంలో.. మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలపై వడ్డీ రాయితీ చెక్కుల పంపిణీ(VLR Cheques Distribution)లో ఆమె పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు సంబంధించిన 8178 మహిళా సంఘాల (SHGs)కు రూ.17 కోట్ల 36 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాల వడ్డీ రాయితీ చెక్కుల(Bank linkage loan interest subsidy cheques)ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. మహిళలు ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తారని, అందుకే ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారని అన్నారు. మహిళలు కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తారని, ఓర్పుతో కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారని తెలిపారు. మహిళల ఆశీర్వాదంతోనే కుటుంబాలైనా, ప్రభుత్వాలైనా నిలబడతాయని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ (Collector) రిజ్వాన్ బాషా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Mla Kadiyam Srihari) ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News