ఎన్డీటీవీ(NDTV) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన PGTI గోల్ఫ్ ప్రో-అమ్(Golf Pro-AM) ముగింపు వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి(Minister for Tourism and Culture) జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) పాల్గొన్నారు. గోల్ఫ్ క్రీడకు మరింత ప్రజాదరణ లభించేలా చేయడమే లక్ష్యంగా ఈ వేడుక జరిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు(Gifts) అందజేశారు. ఈ క్రీడలో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను మంత్రి అభినందించారు. కష్టపడి సాధన చేయడం ద్వారా ఏ క్రీడలో అయినా విజయం సాధించవచ్చని మంత్రి తెలిపారు.
- Advertisement -
