కాంగ్రెస్కు ఇది లైఫ్ లైన్..
ఎవరిని బరిలోకి దింపితే
గెలుపొందే అవకాశం ఉంది..?
బొంతు రామ్మోహన్ వైపే కాంగ్రెస్ చూస్తుందా..?
మాజీ మేయర్ ఫాక్టర్ కాంగ్రెస్కు కలిసొచ్చేనా.?
నవీన్ యాదవ్క కాంప్రమైజ్ పోస్టు లేక నామినేటెడా..?
జూబ్లీహిల్స్ టికెట్ కోసం పలువురు సీనియర్ల ప్రయత్నం
జూబ్లీహిల్స్ బైపోల్ కేవలం ఓ ఉపఎన్నిక కాదు. ఇది తెలంగాణలోని రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్ష…
జూబ్లీహిల్స్ బైపోల్ కేవలం ఓ ఉపఎన్నిక కాదు. ఇది తెలంగాణలోని రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్ష, నగరంలో ఇప్పటివరకు ఐలహీనంగా ఉన్న కాంగ్రెస్, ఈ సీటుతో పుంజు కోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. “ఎవరిని బరిలోకి దింపితే గెలుపు ఖాయం?” అన్న లెక్కల్లో ఇప్పుడొక కొత్త పేరు వినిపి స్తోంది.. అదే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఈ నేపథ్యం లో జూబ్లీహిల్స్ టికెట్ ఆయనకే కేటాయించే అవకాశముందన్న ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి..
మాజీ మేయర్ గా పనిచేసిన రామ్మోహన్ నగర ప్రజలకు సుపరిచితుడు. జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లతో గాఢమైన అనుబంధం, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడం ఆయన ప్రత్యేకత, మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ, కాలనీల సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాల్లో ఆయన చూపిన పట్టుదల చొరవ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. కాంగ్రెస్ ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి, అందులో మొదటిది. నగరంలో తన బలం పెంచుకోవడం.. రెండవది బీఆర్ఎస్.. బీజేపీ లెక్కలను చిత్తుచేయడం ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి సాధించే అవకాశం రామ్మోహన్ను బరిలోకి దింపితేనే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ మేయర్ ఫేస్ గా ఆయన పనిచేయడం, ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గడం ఓటర్ల మైండ్సెట్స్ను ప్రభావితం చేసే అంశం. ముస్లిం కార్పొరేటర్లతోనూ, హిందూ సంఘాలతోనూ ఆయనకు ఉన్న అనుబంధం సోషల్ ఇంజనీరింగ్లో కాంగ్రెస్లో అదనపు లాభం చేకూర్చే అవకాశం ఉంది. సవీన్ యాదవ్ అంశం సర్దుబాటు ఫార్ములా..
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అంతర్గతంగా మరో సవాల్ ఎదుర్కొంటోంది. అదే నవీన్ యాదవ్ ఫ్యాక్టర్, నవీన్ యాదవ్ పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ, టికెట్ విషయంలో వర్గాల లెక్కల్లో ఆయన పేరు వెనుకబడుతోంది. అయితే నవీన్ యాదవు పూర్తిగా పక్కన పెట్టే స్థితి కాంగ్రెస్ కి లేదు. అలా చేస్తే అసంతృప్తి విపరీతంగా పెరిగి, పార్టీ బలహీన పడే ప్రమాదం ఉంది. అందుకే పార్టీ వ్యూహకర్తలు “సర్దుబాటు ఫార్యులా” వైపు మొగ్గుచూపుతున్నారు. అంటే, టికెట్ రామ్మోహన్రె ఇస్తే, నవీన్ యాదవ్కు నామినేటెడ్ పోస్టు లేదా ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించడం. ఈ విధంగా ఒకే నిర్ణయంతో రెండు లాభాలు.. ఇలా చేయడం వలన అసంతృప్తిని చల్లార్చడం, గెలుపు అవకాశాలను కాపాడుకోవడం ఒకే సారి రెండు లక్ష్యాలు నెరవేరినట్లవుతుంది.. ఈ ఫార్ములా అమలైతే, కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో ఏకమై బరిలోకి దిగి, బలమైన పోరాటం చేసే అవకాశాలు మరింత పెరుగుతాయి.
జూబ్లీహిల్స్లో లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురూ పోటీదారులు, కానీ కాంగ్రెస్ గెలవాలంటే బీఆర్ఎస్ అసంతృప్తి
ఓటర్లను తనవైపు తిప్పుకోవాలి.. మధ్యతరగతి.. బస్తీ ఓటర్ల మద్దతు దక్కించుకోవాలి. ఈ లెక్కలకు సరిపడే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవాలి.. రాజకీయాల్లో ఒక్కోసారి ఒక సీటు, ఒక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్కు అలాంటిదే. అవకాశాన్ని సరిగ్గా వినియోగిస్తే, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే మార్గం సుగమం అవుతుంది. లేదంటే, కాంగ్రెస్ శూన్యంలోకి వెళ్ళక తప్పదు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కలో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో బరిలోకి దిగేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ముస్లిం వర్గాల నుండి కూడా పలువురు నాయకులు టికెట్
కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతుందో అనే విషయంలో స్పష్టత రాలేదు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది ఫలితాన్ని నిర్ణయిం చనుంది. మరోవైపు, ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.