ఇండియన్ నేవీ(Indian Navy)లో 260 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్(Short Service Commission Officer) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 76, పైలట్ 25, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 20, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18, లాజిస్టిక్స్ 10, ఎడ్యుకేషన్ 7 + 8, ఇంజనీరింగ్ బ్రాంచ్ 42, సబ్ మెరైన్ టెక్ ఇంజనీరింగ్ 8, ఎలక్ట్రికల్ బ్రాంచ్ 38, సబ్ మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ 8 ఖాళీలు ఉన్నాయి. అవివాహితులు మాత్రమే అర్హులు. ఫిబ్రవరి 24 లోపు ఆన్‌లైన్(www.joinindiannavy.gov.in)లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. కోర్సు 2027 జనవరిలో ప్రారంభమవుతుంది. అనంతరం రెండేళ్లు ప్రొబేషన్. సబ్ లెఫ్టినెంట్ ప్రారంభ వేతనం దాదాపు లక్షా పాతిక వేల రూపాయలు.
- Advertisement -
