Wednesday, February 25, 2026
Homeసాహిత్యంHindi | హిందీ దినోత్సవ సందేశమిదే

Hindi | హిందీ దినోత్సవ సందేశమిదే

మన దేశం భాషల సమాహారం. ప్రతి భాష ఒక సంస్కృతి. ఒక చరిత్ర. ఒక జీవన విధానం. ఇలాంటి దేశంలో భాష(Language)ను రాజకీయ ఆయుధం(Political Weapon)గా మార్చడం ప్రమాదకరమైన ధోరణి(Dangerous Trend) అని చెప్పొచ్చు. ఎందుకంటే.. హిందీ అనేది విభజన కోసం కాదు. ఈ భాష దేశ ఐక్యత(Unity)కు ప్రతీక. హిందీ.. ఏ ఒక్క ప్రాంతానికో చెందిన భాష కాదు. స్వాతంత్ర్య సమరం(Freedom Struggle)లో దేశమంతటా వినిపించిన ఏక స్వరం. ‘దేశ ప్రజలను కలిపి ఏకతాటిపై నడిపే భాష’ అనే కోణంలో గాంధీ(Gandhi).. హిందీని చూశారు. ఈ భాష రాజ్యాధికారాన్ని సాధించే సాధనం కాదు. ప్రజల మధ్య సంభాషణకు వారధి.

నేటి రాజకీయ వాతావరణంలో హిందీని బలవంతంగా రుద్దే భాషగా చిత్రీకరించడం వాస్తవాన్ని వక్రీకరించడమే. హిందీ వ్యతిరేకత వెనక భాషా ప్రేమ కన్నా రాజకీయ లాభాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాషా గౌరవం పేరుతో జాతీయ ఐక్యతను దెబ్బతీయడం ప్రమాదకరం. ఒక భాషకు గౌరవం ఇవ్వడం అంటే మరొక భాషను తగ్గించడం కాదు. హిందీ ఎప్పుడూ ఇతర భారతీయ భాషలను తొక్కేయ లేదు. వాటి పదాలతో, భావాలతో మరింత విస్తరించింది. హిందీ భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషల్లో ఒకటి. అది పరిపాలనలో, విద్యలో, దేశవ్యాప్త సంభాషణలో కీలక పాత్ర పోషిస్తోంది.

- Advertisement -

దేశంలోని కోట్లాది ప్రజలకు ఇది రెండో భాషగా, అనుసంధాన భాషగా పనిచేస్తోంది. ఈ వాస్తవాన్ని నిరాకరించడమంటే దేశ వాస్తవాన్ని నిరాకరించినట్లే. సాంస్కృతికంగా హిందీ భారతీయ భావజాలానికి ప్రతిబింబం. భక్తి కవిత్వం నుంచి ఆధునిక సాహిత్యం వరకు, జానపద గీతాల నుంచి ప్రపంచ వేదికలపై భారత జాతి ఖ్యాతి వినిపించే వరకు హిందీ ఒక భావధార. అది ఏ భాషనూ అణచలేదు. అనేక భాషల సారాన్ని తనలో కలుపుకుంది. అంతర్జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.

భాషల మధ్య పోటీ కాదు. పరస్పర గౌరవమే మన దేశ బలం. హిందీపై వ్యతిరేకత పేరుతో జాతీయ భావనను బలహీనపరచే ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలి. భాషను రాజకీయంగా వాడే ధోరణిని తిరస్కరించాలి. హిందీ భారతీయతకు అక్షర రూపం. అది బలవంతంగా రుద్దే భాష కాదు. ఒక సమైక్యతా సూత్ర బంధం. ఆ బంధాన్ని బలపరచడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఇదే అంతర్జాతీయ హిందీ దినోత్సవం ఇచ్చే నిజమైన సందేశం.

(జనవరి 10న అంతర్జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా)

  • కమలేకర్ నాగేశ్వర్ రావు
- Advertisement -
RELATED ARTICLES

Latest News