Monday, October 27, 2025
ePaper
Homeఅంతర్జాతీయం‘శుభ్’యాత్రకు వేళాయె

‘శుభ్’యాత్రకు వేళాయె

జూన్ 10న ఐఎస్ఎస్‌కు శుభాన్షు శుక్లా పయనం

మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా రేపు (జూన్ 10 మంగళవారం) రోదసీ యాత్రకు బయలుదేరుతున్నారు. యూఎస్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ తలపెట్టిన ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం పేరు ఏఎక్స్‌-4. ఈ మిషన్‌లో భాగంగా ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కి చేరుకుంటారు. తద్వారా.. రాకేష్ శర్మ అనంతరం.. ఐఎస్ఎస్ యాత్ర చేసిన రెండో ఇండియన్‌గా రికార్డు నెలకొల్పుతారు.

తాజా స్పేస్ జర్నీ మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభమవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆకాశంలోకి ప్రవేశిస్తారు. శుభాన్షు శుక్లాతో కలిపి పోలండ్‌, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను ఈ ప్రయోగంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ఈ మిషన్‌కి శుభాన్షు శుక్లా పైలట్‌ కావటం విశేషం. ఇండియాకి చెందిన రాకేశ్‌ శర్మ 4 దశాబ్దాల కిందట 1984లో ఐఎస్ఎస్‌కి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News