Monday, January 19, 2026
EPAPER
Homeహైదరాబాద్‌Iscuf | ఘనంగా జరిగిన ఇస్కఫ్-టీ రెండో మహాసభలు

Iscuf | ఘనంగా జరిగిన ఇస్కఫ్-టీ రెండో మహాసభలు

భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(Indian Society for Cultural Co-operation and Friendship-Iscuf) తెలంగాణ రాష్ట్ర(Telangana State) రెండో మహాసభ(2nd Mahasabha)లు హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ(New Committee)ని ఎన్నుకున్నారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్ రావు(Kadaru Prabhakar Rao) అధ్యక్షుడిగా(President), ఆర్.గోపాల్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ సారంగపాణి, కె.భిక్షమయ్య, ఎస్.అరుణ్ కుమార్, వై. శ్రీరాఘవరావు, వి.వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ డి.రాధాకృష్ణ, కార్యదర్శులుగా ఎన్.ఎస్.అర్జున్ కుమార్, ఎన్.రాజమౌళి, కొండపర్తి శ్రీనివాస్, మద్దినేని రమేష్ బాబు, వి.కొండలరావు, ఎం.ఎ.కరీం, కోశాధికారిగా అవ్వ విజయలక్ష్మి, మరో 20 మందితో కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో పలు అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. అవి..

  1. వెనెజువెలాపై అమెరికా దాడులను, నిర్బంధాలను, ఆంక్షలను తక్షణమే నిలిపివేయాలి.
  2. పాలస్తీనాకు తక్షణమే స్వాతంత్రం ప్రకటించాలి. ఇజ్రాయిల్ దాడులను నిలిపివేయాలి.
  3. భారత వాణిజ్యంపై సుంకాలను విధించి ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే అమెరికా తన ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి.
  4. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కళాకారుల ప్రదర్శనలకు ఓపెన్ థియేటర్లను నిర్మించాలి.

హైదరాబాద్ నగర అధ్యక్షుడు కొండపర్తి శ్రీనివాసు వందన సమర్పణ చేశారు. చెన్నైలో జరగనున్న ఇస్కఫ్ జాతీయ మహాసభలకు తెలంగాణ నుంచి 30 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News