- స్పష్టం చేసిన డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి..
హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలను అడ్డుకోవడం లేదని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయీద్ ఖటిబ్‌జాదే తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలను ఎందుకు దాడి చేస్తున్నారో అమెరికాను భారత్ ప్రశ్నించాలని ఆయన అన్నారు. అమెరికానే ప్రమాదకరమైందని, ఆ దేశాన్ని ప్రశ్నించాలన్నారు. హోర్ముజ్ జలసంధిలో స్థిరత్వం కోసం ఇరాన్ ప్రయత్నిస్తుందన్నారు.
ఒకవేళ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే దాని గురించి ప్రకటన చేస్తామని ఇరాన్ మంత్రి వెల్లడించారు. ఆ జలసంధిని మూయలేదని, తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వమని ఆయన అన్నారు. భారత్, ఇరాన్‌ది చదరంగం ఆడే మనస్తత్వం అని, అమెరికాది ఫుట్‌బాల్ మెంటాలిటీ అని పేర్కొన్నారు. దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నారు.
