Thursday, March 26, 2026
Homeఆంధ్రప్రదేశ్Satyakumar | మంత్రి సత్యకుమార్‌కి ఆహ్వానం

Satyakumar | మంత్రి సత్యకుమార్‌కి ఆహ్వానం

భ‌గ‌వాన్ (Bhagavan) శ్రీ స‌త్య‌సాయి బాబా (Sri Satya Sai Baba) శ‌తాబ్ది వేడుక‌ల‌(centenary celebrations)కు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు ఆహ్వానం (Invitation) అందింది. ఈ నెల 23న శ్రీ స‌త్య‌సాయి జిల్లా పుట్ట‌ప‌ర్తి (Puttaprathi) ప్ర‌శాంతి నిల‌యం(Prashanthi Nilayam)లో నిర్వ‌హించే భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా 100వ జ‌యంతి (శ‌తాబ్ది) వేడుక‌ల‌కు నిర్వాహ‌కులు (Organisers) వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ను ఆహ్వానించారు. స‌త్యసాయి సెంట్ర‌ల్ ట్ర‌స్టు (Central Trust) ఏపీ అధ్య‌క్షుడు ఆర్‌.ల‌క్ష్మ‌ణ‌రావు సూచ‌న మేర‌కు ఆహ్వాన ప‌త్రిక‌ను ట్ర‌స్టు ప్ర‌తినిధులు గురువారం ఏపీ స‌చివాల‌యంలోని కార్యాల‌యంలో మంత్రికి అంద‌జేశారు.

రాష్ట్ర కార్య‌క్ర‌మంగా స‌త్య‌సాయిబాబా 100వ జ‌యంతి వేడుక‌లు

- Advertisement -

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా 100వ జ‌యంతి వేడుక‌ల్ని రాష్ట్ర కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గ‌త‌ నెల 30న‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర టూరిజం, యువ‌జ‌న స‌ర్వీసుల‌ శాఖ నేతృత్వంలో ఈ వేడుక‌ల్ని నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News