Wednesday, March 4, 2026
Homeఖమ్మంEnquiry | ‘టీచర్.. టార్చర్..’పై విచారణ

Enquiry | ‘టీచర్.. టార్చర్..’పై విచారణ

‘ఆదాబ్ హైదరాబాద్’ ఎఫెక్ట్

పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు (Teacher) లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంపై ఇటీవల ఆదాబ్ హైదారాబాద్ (Aadab Hyderabad) దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. కూసుమంచి మండల విద్యాధికారి బీవీ రామాచారి మంగళవారం నరసింహులగూడెం మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన, వికృత చేష్టలపై విచారణ (Enquiry) చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా విద్యా శాఖ అధికారిణికి నివేదిక (Report) అందజేయనున్నారు. ఈ విచారణలో నాయకన్ గూడెం సముదాయం ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి, సీఆర్పి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News