లెక్కలు చూపని రూ. 2.51 లక్షల నగదు స్వాధీనం
ప్రజలకు ఇవ్వాల్సిన 29 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కార్యాలయాల్లో ఉంచిన అధికారులు
పలు కార్యాలయాల్లో పనిచేయని సీసీటీవీ కెమెరాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు (Random Checks) నిర్వహించారు. తనిఖీల్లో సుమారు రూ. 2.51 లక్షల మేర లెక్కల్లో చూపని నగదు(Cash)ను స్వాధీనం (Possession) చేసుకున్నారు. 289 రిజిస్ట్రేషన్ పత్రాలను (Documents) ప్రజలకు ఇవ్వకుండా కార్యాలయాల్లోనే ఉంచినట్లు గుర్తించారు. అధికారుల అనుమతి లేకుండానే 19 మంది ప్రైవేట్ వ్యక్తులు(Private Persons), 60 మంది డాక్యుమెంట్ రైటర్లు (Document Writers) కార్యాలయాల్లో సంచరిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పలు కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు (CCTV Camera) పనిచేయట్లేదని కూడా అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా 13 మంది సబ్ రిజిస్ట్రార్ అధికారుల నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు (Searches) నిర్వహించారు. వారి ఇళ్లలో పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు(Gold Ornament), ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
