తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో ఓ కొడుకు తన తల్లిదండ్రులను కొట్టి ఇంట్లోంచి గెంటేసిన అమానవీయ ఘటన(Inhumane incident) చోటుచేసుకుంది. వనచర్ల వెంకటేశ్ తన తల్లిదండ్రులైన రాంబాబు, మంగమ్మలను సోమవారం చితకబాది రోడ్డుపైకి గెంటేశాడు. ఆ రాత్రి వారు పక్కింట్లో నిద్రపోగా వారికీ ఆశ్రయం ఇచ్చిన వారిని బూతులు తిట్టాడు. తన సోదరి కేతా భవాని తల్లిదండ్రులతో కలిసి ఉంటుండటంతో ఆమెను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఒత్తిడి చేసేందుకు వెంకటేశ్ ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
Inhumane incident | తల్లిదండ్రులను రోడ్డుపైకి గెంటేసిన కొడుకు
RELATED ARTICLES
- Advertisment -