Monday, March 23, 2026
HomeరాజకీయంInauguration | ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు

Inauguration | ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు

  • కాంగ్రెస్ పార్టీ నాయకులు

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు,సోమవారం మేడ్చల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ రాములమ్మ గారి కుటుంబీకులకు మంజూరైన రూ.5లక్షలతో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి ,సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేందర్ గౌడ్,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ ముఖ్య అతిధులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని ప్రభుత్వం,ప్రతి పేదవానికి సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది అని తెలిపారు,ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులకు,అందరికీ ఆత్మగౌరవంతో కూడిన నివాసం ఉండాలన్నదే మన ప్రభుత్వ సంకల్పం అన్నారు.

- Advertisement -

గతంలో ఇందిరా గాంధీ పేదల కోసం ఇళ్లు నిర్మించిన స్ఫూర్తితో,నేడు మన రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తూ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరపున ₹5 లక్షల ఆర్థిక సాయం అందించబడుతుందని తెలిపారు, ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని,పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని,ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు,పట్టణాలు లేవని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఏఇ సుభాష్ రెడ్డి,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు కురుమ,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి, మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్ సి సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్ చింటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనకాల నాగభూషణం బుషి, రామన్నగారి రాఘవేందర్ గౌడ్, నడికొప్పు రంజిత్ ముదిరాజ్, రామన్నగారి సంతోష్ గౌడ్,మరిగల బాబు,వేముల రంజిత్ రెడ్డి,చీర్ల ఆకాష్ కురుమ,గుండ గణేష్,మల్లేష్, సంతోష్, వెంకటేష్, సోను కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News