- విమానాల అంతరాయాన్నిసరిదిద్దుతున్నాం..
- ఇండిగో విమానయాన సంస్థ తాజా ప్రకటన..
- ఇండిగో విమానాని బాంబు బెదరింపు..
- అహ్మదాబాద్ కు మళ్లింపు
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణ సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. నవంబర్‌లో ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ ప్రకటించింది. అంతేకాదు, కేవలం గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది.
ఢిల్లీ , ముంబై,హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సంక్షోభం తలెత్తింది. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై ఇండిగో సంస్థ స్పందించింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరించ నున్నామని వెల్లడిరచింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టులలో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే ఏకంగా 250 నుంచి 300 విమానాలను సంస్థ రద్దు చేసింది. ఈ కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో సంక్షోభం ఏర్పడిరది. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఎయిర్‌పోర్ట్స్ వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. విమానాలు రద్దు కావడంతో ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. అదే సమయంలో తాజా పరిస్థితిపై ప్రయాణికులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాలలో ప్రయాణికులు ఆగ్రహంతో సిబ్బందిని నిలదీస్తున్న దఅశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోడీ, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ట్యాగ్ చేస్తూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 7 గంటలకు పైగా చిక్కుకుపోయిన ఓ ప్రయాణికుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం తలెత్తినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు 12 గంటలకు పైగా ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా పడిగాపులు పడుతున్నారని, ఇండిగో సిబ్బంది అబద్దాలు చెబుతూ జలగల్లా పీడిస్తున్నారని విమర్శించారు. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టులలో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాలలో ప్రయాణికులు ఆగ్రహంతో సిబ్బందిని నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ పనితీరును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ప్రశ్నించింది. నవంబర్‌లో 1,232 విమానాలు రద్దవడంతోపాటు విమానాల రాకపోకల సమయాల్లో జాప్యం జరిగింది. ఈ పరిస్థితిపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యల గురించి ఇండిగోతో కలిసి మదింపు చేస్తున్నట్లు తెలిపింది.
ఇండిగో విమానానికి బాంబు బెదరింపు
షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ`మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో మానవ ఐఈడీ ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, విమానాన్ని దాని గమ్యస్థానం హైదరాబాద్‌కు కాకుండా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్ళించారు.
అహ్మదాబాద్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అనంతరం భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో కలిసి విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండవసారి. గతంలో, కువైట్ నుండి హైదరాబాద్‌కు రావాల్సిన మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో, ఆ విమానం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు కూడా ప్రయాణికులను దించి, బాంబు డిస్పోజల్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
