Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్India | ఇండియా విజయం.. సిరీస్ కైవసం..

India | ఇండియా విజయం.. సిరీస్ కైవసం..

సౌతాఫ్రికా(South Africa)తో విశాఖపట్నం(Vishakapatnam)లో జరిగిన మూడో వన్డే(Third One day)లో ఇండియా ఘన విజయం (India Grand Victory) సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం (Series Won) చేసుకుంది. మొదటి వన్డేలో ఓడిన మన దేశం చివరి రెండు వన్డేల్లో అద్భుతంగా ఆడింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేరుకుంది.

ఓపెనర్ జైశ్వాల్ (Jaiswal) 116 రన్నులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) 75 పరుగులు చేసి ఔట్ అవగా విరాట్ కోహ్లీ (Virat Kohli) 65 రన్నులతో నాటౌట్‌గా ఉన్నాడు. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కన్నా ముందు ఇండియా వరుసగా 20 సార్లు టాస్ ఓడిపోవటం గమనార్హం. సౌతాఫ్రికా టీమ్‌లో డికాక్ సెంచరీ చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News