Tuesday, March 3, 2026
Homeస్పోర్ట్స్T20 Series | టీ20 సిరీస్ భారత్ సొంతం

T20 Series | టీ20 సిరీస్ భారత్ సొంతం

ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని ఇండియా(India) కైవసం చేసుకుంది. బ్రిస్బేన్‌(Brisbane)లో ఇవాళ జరగాల్సిన ఐదో మ్యాచ్ వర్షం (Rain) కారణంగా రద్దయింది (Cancel). మొదటి మ్యాచ్ సైతం వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఒక మ్యాచ్ (Match) ఓడిపోయిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (Player Of The Series) అవార్డ్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు దక్కింది. ఐదో మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. 4.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 52 రన్నులు చేసింది. అభిషేక్ శర్మ 23, శుభ్‌మన్‌గిల్ 29 పరుగులు చేశారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో వాతావరణం ప్రతికూలంగా మారటం, వర్షం కురవటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News