Wednesday, March 4, 2026
Homeస్పోర్ట్స్Second Test Match | ఒక్క రోజులో చేయాల్సిన పరుగులు 522

Second Test Match | ఒక్క రోజులో చేయాల్సిన పరుగులు 522

గువాహటిలో సౌతాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా (India) ఇంకా 522 పరుగులు చేస్తే గెలుస్తుంది. కానీ.. చేతిలో ఉన్నది ఒక్క రోజు మాత్రమే. ఇవాళ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మన దేశం రెండు వికెట్లు కోల్పోయి 27 రన్నులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే టీమిండియా ఓటమి (defeat) బాటలో పయనిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. ఆలౌట్ కాకుండా నిలబడి ఉంటే మినహా.. డ్రా (draw) చేసుకోవటానికి వీల్లేదు.

డ్రా చేసుకున్నా కూడా సిరీస్ మాత్రం దక్కదు. ఎందుకంటే మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఇప్పటికే దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తేనే సిరీస్ సమం (Series Equal) అవుతుంది. కానీ.. మహాఅయితే ఓటమిని తప్పించుకొని డ్రా చేసుకోగలుగుతారేమో. అది కూడా చాలా కష్టం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News