Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeబిజినెస్భారతదేశం.. బంగారు దేశం..

భారతదేశం.. బంగారు దేశం..

మన దేశంలో ఏకంగా 25 వేల టన్నుల బంగారం ఉంది. ఇళ్లల్లో, గుళ్లల్లో ఉన్న పుత్తడి సుమారు రెండున్నర కోట్ల కిలోలు. దీని విలువ రూ.200 లక్షల కోట్లు. ఇండియా జీడీపీ అంచనాల్లో 56 శాతం. వరల్డ్‌లోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం మన సొంతం. అందుకే.. భారతదేశం బంగారు దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు కొండ ఇండియా.

2020తో పోల్చితే గోల్డ్ రేట్లు రాకెట్ స్పీడ్‌తో పెరిగి డబుల్ అయ్యాయి. 10 గ్రాముల పసిడి ధర లక్షకు చేరింది. గతేడాది మన దేశంలో పసిడి గిరాకీ 782 టన్నులకు చేరింది. కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 6 శాతానికి తగ్గడంతో బంగారం రిటైల్ ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా పెరిగాయి. భారత్‌లో గోల్డ్ గిరాకీ 725 టన్నులకు చేరుతుందని అంచనా. 2026లో‌‌‌ 800 టన్నుల దగ్గర స్థిరపడే అవకాశముంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News