Saturday, February 7, 2026
Homeసినిమావిజయ్ దేవరకొండపై కేసు

విజయ్ దేవరకొండపై కేసు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. గిరిజనులను అవమానించేలా మాట్లాడారనే ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రెట్రో అనే మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలను గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని అశోక్ కుమార్ రాథోడ్ అనే గిరిజిన సంఘం నాయకుడు కంప్లయింట్ చేశారు. విజయ్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మాదాపూర్ ఏసీపీ కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News