సహకార రంగం(Cooperative Sector)లో ఇండియా ప్రపంచంలోనే నంబర్-1గా నిలవటం విశేషం. నేషనల్ కోపరేటివ్ డేటా బేస్(National Cooperative Data Base) ప్రకారం గత మూడేళ్లలో భారత సహకార రంగం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యవస్థీకృత ఆర్థిక నెట్‌వర్క్‌ల్లో(Organized Financial Networks) ఒకటిగా విస్తరించింది. అధికారిక, రంగాలవారీ డేటా ప్రకారం నమోదిత సహకార సంఘాల సంఖ్య ఇప్పుడు దాదాపు 8.5 లక్షలు. సభ్యత్వం 32 కోట్లకు చేరువైంది. 2023 చివరి నాటికి భారతదేశంలో దాదాపు 7.94 లక్షల సహకార సంఘాలు, 29.08 కోట్ల మంది సభ్యులు ఉన్నారని జాతీయ సహకార డేటాబేస్ చెబుతోంది.
2024 డిసెంబర్ నాటికి క్రియాశీలక సహకార సంఘాలు దాదాపు 6.21 లక్షలు అని అంచనా. అయితే.. సభ్యత్వం 28.7 కోట్ల దగ్గర ఉంది. 2025 నాటికి మరిన్ని రిజిస్ట్రేషన్లు, మెరుగైన డేటా మ్యాపింగ్(Better Data Mapping) కారణంగా కేవలం రెండేళ్లలోపు సభ్యత్వం దాదాపు 3 కోట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల్లో మన దేశం వాటా దాదాపు 27 శాతం. అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం సహకార సంస్థలు ప్రపంచ ఉపాధిలో దాదాపు 10% షేర్ కలిగి ఉన్నాయి. గ్లోబల్ టాప్(Global Rankings) 300 ర్యాంకింగ్స్‌లో దాదాపు 15 భారతీయ సంస్థలు ఉన్నాయి.
