Thursday, February 5, 2026
Homeఅంతర్జాతీయంOil | ఇండియాకు ఆ స్వేచ్ఛ ఉంది..

Oil | ఇండియాకు ఆ స్వేచ్ఛ ఉంది..

  • ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలుచేయవచ్చు..

ఏ దేశం నుంచి అయినా భార‌త్ స్వేచ్ఛ‌గా ఇంధ‌నాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు అని రష్యాపేర్కొన్న‌ది. చ‌మురు, ఇంధ‌నం స‌ర‌ఫ‌రా అంశంలో త‌మ విధానంలో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని క్రెమ్లిన్ వెల్ల‌డించింది. భార‌త్‌కు కేవ‌లం ర‌ష్యా మాత్ర‌మే ఇంధ‌నాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని, ఇత‌ర దేశాల నుంచి కూడా చ‌మురును భార‌త్ కొనుగోలు చేస్తోంద‌ని, దీంట్లో కొత్త‌గా మేం ఏం చేసేది లేద‌ని ర‌ష్యా ప్ర‌తినిధి దిమిత్ర పీస్కోవ్ తెలిపారు.

ర‌ష్యా నుంచి ఇంధ‌నం కొనుగోలును ఆపేందుకు ప్ర‌ధాని మోదీ అంగీక‌రించార‌ని, ర‌ష్యాకు బ‌దులుగా ఇక నుంచి వెనిజులా నుంచి భార‌త్ ఆయిల్‌ను కొంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా ప్ర‌తినిధి పెస్కోవ్ స్పందిస్తూ .. త‌మ నుంచి ఇంధ‌నం కొనుగోలు ఆపేస్తున్న‌ట్లు ఇండియా నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేద‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News