ఒకవైపు రూపాయి విలువ (Rupee Value) బలహీనపడుతున్నప్పటికీ మరోవైపు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు మాత్రం ఈవారం పెరిగాయి. వరుసగా గత మూడు వారాలు పడిపోయిన ఫారెక్స్ రిజర్వ్స్ ఈసారి పుంజుకోవటం గమనించాల్సిన విషయం. బంగారం నిల్వలు (Gold Reserves) వృద్ధి చెందటమే దీనికి కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) లేటెస్ట్‌గా విడుదల చేసిన నివేదిక(Report)లోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
నవంబర్ 14తో ముగిసిన వారంలో
విదేశీ మారక నిల్వలు 5.543 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 692.576 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగి 890 టన్నులకు పైగా చేరటంతో ఫారెక్స్ రిజర్వ్స్ రైజ్ అయ్యాయి. విదేశీ మారక నిల్వల్లో అత్యధిక వాటా కలిగిన ఫారన్ కరెన్సీ అసెట్స్ (Foreign currency assets) భారీగా కాకుండా మామూలుగానే పెరిగాయి. 152 మిలియన్ డాలర్లు ప్లస్ అయి టోటల్‌గా 562.29 బిలియన్ డాలర్లకు చేరాయి.
మరో రెండు కాంపొనెంట్లు
ఫారెక్స్ రిజర్వ్స్‌లో స్వల్ప భాగం కలిగిన మరో రెండు కాంపొనెంట్లు నామమాత్రంగా పెరిగాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (Special Drawing Rights) 56 మిలియన్లు పెరిగి 18.65 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (International Monetary Fund) వద్ద రిజర్వ్ పొజిషన్ (Reserve Position) 8 మిలియన్ డాలర్లు పెరిగి 4.779 బిలియన్ డాలర్లకు చేరాయి.
