ఇండియా ఉత్పత్తుల(India Products)పై అమెరికా అధిక సుంకాలు(America Additional Taxes) విధిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి మన ఎగుమతులు తగ్గాయి. అమెరికా బదులు ఇతర దేశాలకు మళ్లాయి. 2025 సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలో ఈ మేరకు స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక(Bank Of Baroda Report) వెల్లడించింది. ఇండియా ఉత్పత్తులపై అమెరికా ఆగస్ట్ 7 నుంచి 25 శాతం ఎక్కువ పన్నులు విధించింది. అదే నెల 27 నుంచి ఈ ట్యాక్స్‌ను 50 శాతానికి పెంచింది. ఇందులో 25 శాతాన్ని పెనాల్టీ(Penalty)గా వసూలు చేస్తోంది. దీంతో అమెరికా మినహా ఇతర దేశాలకు చేసే ఎక్స్‌పోర్ట్‌లు 89.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది 2024 సెప్టెంబర్-నవంబర్‌లో 86.2 బిలియన్ డాలర్లు మాత్రమే. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులు(Marine Products), ఎలక్ట్రానిక్ గూడ్స్, జెమ్స్, జ్యూలరీ వంటివి వేరే దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఎస్‌కి వెళ్లాల్సిన ఇండియన్ మెరైన్ ప్రొడక్టులు 13.6 శాతం తగ్గాయి. చైనాకి 20.6 శాతం, థాయ్‌లాండ్‌కి 7.3 శాతం పెరిగాయి. జెమ్స్, జ్యూలరీ ఎక్స్‌పోర్ట్స్‌కి ప్రధాన గమ్యస్థానంగా హాంగ్‌కాంగ్ ఎదగటం గమనార్హం. ఆ దేశానికి ఎగుమతులు 11 శాతానికి చేరాయి.
Exports | యూఎస్‌కి తగ్గిన ఇండియా ఎగుమతులు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
