Tuesday, March 3, 2026
Homeఖమ్మంIndiramma Illu | లబ్ధిదారులే బ్రాండ్ అంబాసిడర్లు

Indiramma Illu | లబ్ధిదారులే బ్రాండ్ అంబాసిడర్లు

పేద ప్రజలకు వరం.. ఇందిరమ్మ ఇండ్ల పథకం
గూడు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న..
ప్రభుత్వ లక్ష్యాన్నినెరవేర్చే దిశగా అడుగులు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం(Telangana Statewide)గా మొదటి దశ(First Phase)లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించారు. అదనంగా 1500 ఇళ్లను ఎస్టీ నియోజకవర్గాలకు ఇచ్చారు. రాష్ట్రం మొత్తమ్మీద 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉండగా 2026 మార్చి నాటికి లక్షకు పైగా ఇళ్ల గృహప్రవేశాలు జరగనున్నాయి. లబ్ధిదారులకు పథకం అమలులో ఇబ్బంది రాకుండా కింది స్థాయి నుంచి పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

మొబైల్ యాప్(Mobile App), అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక కాల్ సెంటర్(1800 599 5991)ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం లబ్దిదారులకు నిర్మాణ స్థాయిని బట్టి చెల్లింపులు చేస్తున్నారు. తద్వారా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజల సొంతింటి కల నెరవేరుస్తున్నారు. రాష్ట్రంలో శరవేగంగా నిర్మాణమౌతున్నఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులే ప్రచారకర్తలు(Beneficiaries Are The Promoters)గా మారారు.

పథకం గురించి ప్రజలకు వివరిస్తూ వారి ఇంటి నిర్మాణాన్నిచూపిస్తూ మురిసిపోతున్న వీడియోలు ఇప్పుడు హోమ్ టూర్ (Home Tour) పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పట్టుబట్టి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిన ప్రజల సొంతింటి కల నిజమవుతున్న వేళ వారి కళ్లల్లో ఆనందం చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News