వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ (Endowment) శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన ఊడెపు రామారావు.. లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ(ACB)కి చిక్కాడు. యాదగిరిగుట్ట(Yadagirigutta)లో లడ్డూ (Laddu) కౌంటర్లు టెండర్ (Tender) ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్(Contractor)కి మిషనరీ ఖరీదు రూ.11,50,000 బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ (Commisssion) అడిగాడు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్లను కలవడంతో నిఘా పెట్టిన నల్గొండ అధికారులు.. రామారావు ఆడియో కాల్స్ డేటా(Calls Data)ను సేకరించి మేడిపల్లి(Medipalli)లో రూ.1,90,000 తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించి యాదగిరిగుట్ట దేవస్థానంలో కొన్ని ఫైల్స్ స్వాధీనం. ఎల్బీనగర్‌లోని ఆయన ఇంటిపై కూడా రెండు టీములు దాడులు నిర్వహిస్తున్నారు. రామారావును జ్యూడిషల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇలాంటి సమాచారాన్ని ఉంటే తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
