Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిInspection | పోలింగ్ కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జ్ డిసిపి

Inspection | పోలింగ్ కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జ్ డిసిపి

ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల సామాగ్రీ పంపిణి, కౌంటింగ్ సెంటర్ ను మేడ్చల్ జోన్ ఇంచార్జ్ డిసిపి సాయి మనోహర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
కౌంటింగ్ సెంటర్ కు వచ్చే ఏజెంట్లు నిబంధనలు పాటించాలని సూచించారు.

- Advertisement -

కౌంటింగ్ సెంటర్ కు సెల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్ అనుమతి లేదని అందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కౌంటింగ్ అనంతరం ఎలాంటి ర్యాలీలు, జూలూస్ లకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు.

పోలింగ్ ఏర్పాట్ల పై సహాయ జిల్లా ఎన్నికల అధికారి, ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ జోన్ ఏసీపీ శంకర్ రెడ్డి, ట్రాఫిక్ ఏ సి పి వెంకట్ రెడ్డి, మేడ్చల్ సి ఐ సత్యనారాయణ, ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్, పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News