Thursday, February 26, 2026
Homeఆరోగ్యంHealth | ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఉందా?

Health | ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఉందా?

మనిషికి ఎంత సంపద(Wealth) ఉన్నా దాన్ని అనుభవించే అవకాశం లేకపోతే అది ఉండి ఏం సుఖం?. అందుకే ఆరోగ్యానికి (Health) మించిన ఐశ్వర్యం లేదంటారు. సంపాదన యావలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కోలుకోలేని దెబ్బతినటం ఖాయం. డబ్బు(Money) పోయినా పర్లేదు. సంపాదించుకోవచ్చు. కానీ.. జబ్బు(Disease) బారినపడితే?. అది నయమై శరీరం(Body) మళ్లీ పుంజుకోవాలంటే సమయం(Time) పట్టొచ్చు. ఈ క్రమంలో కోల్పోయే విలువైన కాలాన్ని తిరిగి పొందలేం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే ఒకవైపు సమయాన్ని, మరోవైపు సంపదను రెండింటినీ కోల్పోతాం. కాబట్టి.. ఈ మూడింటిలో ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కెరీర్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అంటూ యువత అధిక సమయం శ్రమిస్తే అసలుకే మోసం రావొచ్చు. దురలవాట్లు మానుకోకుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. గతంలో.. మనుషులకు.. కనీసం 50 ఏళ్ల వయసు తర్వాతే వ్యాధులు ముసిరేవి. కానీ.. ఇప్పుడు 30 ఏళ్ల నుంచే చుట్టుముడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్. సమయానికి తినటం, సరిపోను నిద్రపోవటం, శరీరం చెప్పే మాట వినటం.. ఈ మూడూ పాటిస్తే రోగాలు దరిచేరవని పలువురు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News