- చేష్టలుడిగి,చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
- ముడుపులు…”మూడు పువ్వులు-అరుకాయలన్న” విధంగా అందరికీ అందుతున్నాయని పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న ఆరోపణలు
ములుగు జిల్లా మంగపేట మండలం రమనక్కపేట-రాజుపేట గ్రామాల వద్ద రెవెన్యూ భూముల్లో నుంచి గోదావరి నది ఇసుక క్వారీ నిర్వాహకులు (రైజింగ్ కాంట్రాక్టర్లు) అక్రమ రెండు రోజుల నుంచి గ్రావెల్ (ఎర్ర మట్టి-కంకర)యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నప్పటికీ మండల అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. మండలంలోని పలువురు ఇసుక క్వారీ నిర్వాహకులు.
సంబంధిత అధికారులకు ముందే తెలియపరచి సమ్మతి అనుమతి పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి అనుమతి ఏమి లేకుండానే కాంట్రాక్టర్లు జేసిబి లతో అర్ధరాత్రి నుంచి తవ్వకాలు జరిపి వందలకొద్ది లారీలు డంపర్ల తో ఎర్రమట్టి ని ఇష్టారాజ్యంగా తరలిస్తుండగా అధికార యంత్రాంగం సైతం వారికి వత్తాసు పలుకుతూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతానికి మంగపేట మండలం లోని వాడగూడెం,చుంచుపల్లి, రమనక్క పేట, మల్లూరు ఇసుక క్వారీలు నడుస్తుoడగా, ఒకటి రెండు రోజుల్లో రాజుపేట, కత్తిగూడెం, గోదావరి నది ఇసుక క్వారీలు నడవనున్నాయి.
మండలంలోని 17 క్వారీలకు గాను ప్రస్తుతం నాలుగు మాత్రమే నడుస్తున్నప్పటికీ, త్వరలోనే ఒకటి రెండు నెలల్లో మొత్తం క్వారీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నే గోదావరి నదిలో కి రోడ్డు వేసేందుకు కొన్ని చోట్ల నది ఒడ్డున నుంచి రాష్ట్రీయ మెయిన్ రోడ్డు కు ఈ గ్రావెల్ రోడ్లు అంతర్గతంగా అనుసంధానం చేసే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగానే ఆయా ఇసుక క్వారీలకు సమీపంలో ఉన్న రెవెన్యూశాఖ, అటవీశాఖ భూములు-గుట్టలున్న ప్రాంతాల్లో నుంచి పలు యంత్రాలతో ఎర్రమట్టి ని యథేచ్ఛగా తవ్వి వందలాది లారీలతో, డంపర్ల తో ఆయా ప్రాంతాల్లో కి తరలించి వారికి అనుకూలంగా నూతన రోడ్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పెడుతున్న అక్రమ గ్రావెల్ త్రవ్వకాల నిర్వాహకులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత గ్రామస్తులు, ఇసుకాసురుల ఇష్టారాజ్యం ను చూస్తున్న ఈ ప్రాంత ప్రజలు అధికారులను గట్టిగా కోరుతున్నారు.
